ఎల్లమ్మబండ బస్తిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు ఎక్కడ? టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ బస్తిలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ సర్కిల్-51 టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు ప్రోత్సాహం లభిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వేతనాలతో పాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో విఫలమవుతున్నారని, అయితే వసూళ్ల...