తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భరోసా.. సీఐఐ ఉత్తర భారత ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

తెలంగాణ వివిధ రంగాల్లో పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా నిలిచిందని, పారిశ్రామికవేత్తలు ధైర్యంగా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం పెట్టుబడులకు పూర్తి రక్షణ కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థలోని బోధి పెవిలియన్‌లో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఉత్తర భారత (CII Northern Region) ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, మంచి ప్రతిపాదనలతో ముందుకు వచ్చే సంస్థలకు ప్రత్యేక...