ప్రభుత్వ 2బీహెచ్‌కే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో మోసాలు
నకిలీ అలాట్‌మెంట్ ఆర్డర్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్ 52 నకిలీ అలాట్‌మెంట్ పత్రాలు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ జూబ్లీహిల్స్ జోన్ బృందం, మొఘల్‌పురా పోలీసులతో కలిసి ప్రభుత్వ 2బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ పథకం పేరుతో నకిలీ అలాట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేసి అమాయకులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. నిందితుడి వద్ద నుంచి 52 నకిలీ, ఫోర్జరీ పత్రాలు మరియు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు....