భూ కబ్జాదారుల బరితెగింపు.. కుత్బుల్లాపూర్‌లో ప్రభుత్వ భూమి ఫెన్సింగ్ తొలగింపు

కుత్బుల్లాపూర్ పరిధిలోని పెట్‌బషీరాబాద్ సర్వే నంబర్ 23లో ఉన్న ప్రభుత్వ భూమికి గతంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను ఇటీవల రాత్రికి రాత్రే తొలగించడంపై స్థానిక ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం, ప్రభుత్వ భూమిగా గుర్తించిన ఈ స్థలానికి గతంలో రెవెన్యూ శాఖ అధికారులు రక్షణ చర్యల్లో భాగంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఎలాంటి అధికారిక సమాచారం లేకుండానే...