తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TGPLRB) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మొత్తం 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన బోర్డు, తాజాగా ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించింది.అధికారిక ప్రకటన ప్రకారం, ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులను...