ఆషాఢమాస బోనాల మహోత్సవాల సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి డివిజన్ మసీద్ బండ హెచ్‌సీయూ బస్ డిపో సమీపంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, అలాగే ఆదర్శ్ నగర్ కాలనీలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఆషాఢమాస బోనాల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సుభిక్షాలు నెలకొనాలని ప్రార్థించినట్లు తెలిపారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సందీప్ రెడ్డి, నరసింహ గౌడ్, లింగం గౌడ్, మహేష్ గౌడ్, బీజేపీ నాయకులు మహేష్ యాదవ్, కిశోర్, మల్లేష్, నరేష్‌తో పాటు స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.