80 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు యువకుల అరెస్ట్
శంకర్ పల్లి పోలీసులకు అందిన పక్కా సమాచారంతో చేపట్టిన తనిఖీల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులను అరెస్ట్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 3న గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పైపులైన్ రోడ్డులో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న సంచులను పరిశీలించగా మొత్తం 80 కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో గంజాయిని స్వాధీనం...