బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ – హైదరాబాద్‌లో సమావేశం
హైదరాబాద్‌లో బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆగస్టు 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశం కొనసాగనుంది. సమావేశంతో పాటు ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ రెండో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమానికి భారత ప్రభుత్వ సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, సుస్థిరమైన మరియు సమ్మిళిత అభివృద్ధికి అవినీతి పెద్ద అడ్డంకి అని పేర్కొన్నారు. అవినీతి...