గాలిలో ఒక్కసారిగా 300 అడుగులు దిగిన విమానం ప్రయాణికులకు గాయాలు
ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 2379 విమానం గాలిలో తీవ్ర వాయు అల్లకల్లోలానికి (టర్బులెన్స్) గురైంది. దీంతో విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందికి పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించారు. ఘటనను వివరిస్తూ ఓ ప్రయాణికుడు, "విమానం ఒక్కసారిగా కిందికి పడిపోవడంతో మేమంతా సీట్ల నుంచి పైకెగిరి విమానం పైభాగానికి బలంగా తగిలి మళ్లీ కిందపడ్డాం....