ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్స్ – విద్యార్థుల క్యూ.. తెలంగాణలో చారిత్రాత్మక పెరుగుదల

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోంది. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఫస్ట్ ఇయర్)లో మొత్తం 85,453 మంది విద్యార్థులు చేరగా, గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 14 శాతం పెరుగుదల. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 1,64,730 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీజీబిఐబి) కార్యదర్శి అభిలాష అభినవ్...