ఉద్యోగ భద్రత, స్వీయ రక్షణపై సైబరాబాద్ SHE టీమ్స్ అవగాహన

గచ్చిబౌలిలోని ఎజెన్ డేటా ప్రైవేట్ లిమిటెడ్‌లో సైబరాబాద్ SHE టీమ్స్, SCSC సంయుక్త ఆధ్వర్యంలో వర్క్‌ప్లేస్ సేఫ్టీ & సెల్ఫ్-డిఫెన్స్ అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. ఆగస్టు 13న జరిగిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. మహిళల భద్రత, స్వీయ రక్షణ, పరిస్థితులపై అప్రమత్తత, వేధింపులపై ఫిర్యాదు చేసే విధానం, స్టాకింగ్‌ను ఎదుర్కొనే చర్యలు, అత్యవసర సమయంలో అందుబాటులో ఉండే సహాయ వ్యవస్థలపై అవగాహన కల్పించారు. కరాటే మాస్టర్ డాక్టర్ రవి ఆధ్వర్యంలో ఉద్యోగులకు ప్రాక్టికల్ సెల్ఫ్-డిఫెన్స్ పద్ధతులు, ప్రత్యక్ష శిక్షణా...