ADAAB CYBERABAD
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 11:44 am Posted by : JAKA VENKATESH

ఏకేఆర్‌ స్టడీ సర్కిల్‌కు ‘ఎడ్యుకేషనల్‌ ఎక్సలెన్స్‌ 2026’ అవార్డు

విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తూ, ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మార్గదర్శకంగా నిలుస్తున్న ఏకేఆర్‌ స్టడీ సర్కిల్‌కు ప్రతిష్టాత్మక ‘ఎడ్యుకేషనల్‌ ఎక్సలెన్స్‌ 2026’ అవార్డు లభించింది. గత 24 సంవత్సరాలుగా వికారాబాద్‌లో సంస్థ అందిస్తున్న విద్యా సేవలను గుర్తిస్తూ ఫిలాంత్రోపిక్‌ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది. హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఉన్న ఎన్‌టీఆర్‌ కళామందిర్‌లో ఆగస్టు 13న సాయంత్రం 7 గంటలకు అవార్డు ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారత మాజీ కేంద్ర సహాయ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి చేతుల మీదుగా ఏకేఆర్‌ స్టడీ సర్కిల్‌ తరఫున అకాడమిక్‌ డైరెక్టర్‌ స్రవంతి రమణ అవార్డును అందుకున్నారు. 2002లో స్థాపించబడిన ఏకేఆర్‌ స్టడీ సర్కిల్‌, డీఎస్సీ, పంచాయతీ సెక్రటరీ, గ్రూప్‌-3, గ్రూప్‌-4, కానిస్టేబుల్‌, ఎస్‌ఐ, వీఆర్‌ఓ, జీపీఓ, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ అందిస్తూ ఎంతోమంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిందని సంస్థ డైరెక్టర్‌ బీవీ రమణ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సంస్థ అందిస్తున్న సేవలు, విద్యారంగంలో సాధించిన విశేష ఫలితాలను గుర్తించినందుకే ఈ అవార్డు లభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.