ఏకేఆర్‌ స్టడీ సర్కిల్‌కు ‘ఎడ్యుకేషనల్‌ ఎక్సలెన్స్‌ 2026’ అవార్డు

విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తూ, ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మార్గదర్శకంగా నిలుస్తున్న ఏకేఆర్‌ స్టడీ సర్కిల్‌కు ప్రతిష్టాత్మక ‘ఎడ్యుకేషనల్‌ ఎక్సలెన్స్‌ 2026’ అవార్డు లభించింది. గత 24 సంవత్సరాలుగా వికారాబాద్‌లో సంస్థ అందిస్తున్న విద్యా సేవలను గుర్తిస్తూ ఫిలాంత్రోపిక్‌ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది. హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఉన్న ఎన్‌టీఆర్‌ కళామందిర్‌లో ఆగస్టు 13న సాయంత్రం 7 గంటలకు అవార్డు ప్రదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారత మాజీ కేంద్ర సహాయ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి...