స్పీకర్ చేతిలో గన్.. వికారాబాద్‌లో ఈ దృశ్యం వైరల్..!

వికారాబాద్ : సాధారణంగా సభను నడిపించే స్పీకర్‌గా కనిపించే తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ చేతిలో గన్ కనిపించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆసక్తిగా చూశారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఆయుధ ప్రదర్శనలో భాగంగా ఆయన తుపాకీని చేతబట్టి పరిశీలించిన దృశ్యం ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పోలీస్ ఆయుధ ప్రదర్శనలో గడ్డం ప్రసాద్ కుమార్ సందడి.. తుపాకీ పట్టుకుని పరిశీలన.. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలు, రక్షణ పరికరాలను పరిశీలించిన స్పీకర్.. వాటి పనితీరును అధికారులను అడిగి...