22ఏ నిషేధిత జాబితా పై పొంగులేటి క్లారిటీ

పేదల భూములకు పూర్తి రక్షణ.. అన్యాయం జరగనివ్వం 15 రోజుల పాటు రోజువారీగా దరఖాస్తుల పరిశీలన ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : 22ఏ నిషేధిత జాబితాకు సంబంధించి తలెత్తిన సమస్యలను ప్రభుత్వం గుర్తించి, తప్పులను సరిదిద్దే ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత 24 గంటల్లోనే మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 కలిపి మొత్తం 34 రిజిస్ట్రేషన్లు...