రూ.16.40 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం-గచ్చిబౌలి పోలీసుల దాడిలో బట్టబయలు
గచ్చిబౌలి పోలీస్, ఎస్‌ఓటీ సైబరాబాద్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి 95.41 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.16.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో 16 మంది వినియోగదారులను కూడా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీసులు, ఎస్‌ఓటీ సైబరాబాద్ బృందాలు ఈ దాడులు నిర్వహించాయి. కేసు నంబర్ 1431/2026,...