సైబరాబాద్‌లో ఐదుగురు పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు
పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న ఐదుగురు పోలీస్ అధికారులకు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికారు. సైబరాబాద్ సీపీ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో పదవీ విరమణ పొందుతున్న అధికారులను పోలీస్ శాఖ తరఫున సన్మానించారు. పదవీ విరమణ పొందిన వారిలో కేపీహెచ్‌బీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ ఎం. రవీందర్ రెడ్డి, సైబరాబాద్ ఎస్‌బీకి చెందిన ఎస్‌ఐ పి. విజయ్ భాస్కర్ రెడ్డి,...