పట్వారీ శశిధర్ నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
శేరిలింగంపల్లి: ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని శశిధర్ గారికి రాఖీలు కట్టి తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు.ఈ సందర్భంగా మహిళా సోదరీమణులు ఆత్మీయంగా కలిసి రాఖీలు కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీలు కట్టిన ప్రతి సోదరీమణికి పట్వారీ శశిధర్ బహుమతులు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలతో సోదరభావంతో మమేకమై వారి...