సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం : అదనపు ఎస్పీ రాజేష్ మీనా

సైబర్ జాగృత దివస్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగృత దివస్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు, నకిలీ ఆఫర్లు, సోషల్ మీడియా తదితర...