పేదల సొంతింటి కల సాకారం.. ‘ఇందిరమ్మ’తో శాశ్వత గూడు!

పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు పెద్ద భరోసాగా నిలుస్తున్నాయని వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య అన్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో స్థానిక కౌన్సిలర్ గురిబాయితో కలిసి బుధవారం నాలుగు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన నాలుగు ఇళ్లకు రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించి ఇంటి యజమానులకు స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరఫున కానుకలను అందజేశారు. అనంతరం చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ.. గత...