సైబరాబాద్ పోలీసుల ఘనత..1,218 మొబైల్ ఫోన్లు రికవరీ
సైబరాబాద్: పోయిన, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో సైబరాబాద్ పోలీసులు మరోసారి సత్తా చాటారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ఆదేశాల మేరకు CEIR పోర్టల్ ద్వారా 11వ విడతలో మొత్తం 1,218 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.2,43,60,000గా పోలీసులు వెల్లడించారు. కూకట్‌పల్లి సీసీఎస్ పరిధిలో 410 ఫోన్లు, శేరిలింగంపల్లి సీసీఎస్ పరిధిలో 407, కుత్బుల్లాపూర్ సీసీఎస్ పరిధిలో 401 ఫోన్లు రికవరీ చేశారు. స్వాధీనం చేసుకున్న మొబైల్...