తెలంగాణ అభివృద్ధిలో ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకారం కోరిన సీఎం..పనిచేద్దామని విజ్ఞప్తి

హైదరాబాద్‌: తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఆగా ఖాన్ ఫౌండేషన్ మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కోరారు. విద్య, పర్యాటకం, వైద్య రంగాలతో పాటు వారసత్వ సంపద పరిరక్షణలో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. భారత పర్యటనలో ఉన్న ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేశారు....