ఆషాఢ బోనాల ఉత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అధికారులను ఆదేశించారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా టాస్క్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, షీ టీమ్స్, ట్రాఫిక్ పోలీసులను భారీగా మోహరించనున్నారు. మహిళల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
