ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) హైదరాబాద్ రీసెర్చ్ అసోసియేట్-II పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లేదా క్రిస్టల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీతో పాటు ఏడాదికి పైగా అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. గరిష్ఠ వయసు 35 ఏళ్లు. ఎంపిక ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. నెలకు రూ.61,000 వేతనంతో పాటు 30% హెచ్‌ఆర్‌ఏ లభిస్తుంది. దరఖాస్తుల చివరి తేదీ జూలై 26, 2026.
