e-Paper
Saturday, September 12, 2026
Homeజాతియం75 గజాల లోపు స్థలాల్లో 7 మీటర్లకు మించిన నిర్మాణాలపై చర్యలు-అనుమతులు లేని నిర్మాణాలపై కొరడా

75 గజాల లోపు స్థలాల్లో 7 మీటర్లకు మించిన నిర్మాణాలపై చర్యలు-అనుమతులు లేని నిర్మాణాలపై కొరడా

📰 Generate e-Paper Clip

అనుమతులు లేకుండా చేపడుతున్న భవన నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. నిర్మాణ దశలోనే అక్రమ భవనాలను గుర్తించి కూల్చివేయాలని సీహెచ్‌ఎంసీ? కాదు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టౌన్ ప్లానింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల అధికారులను ఆదేశించారు. 75 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న స్థలాల్లో 7 మీటర్లకు మించి ఎత్తులో నిర్మిస్తున్న భవనాలను ప్రత్యేకంగా గుర్తించాలని సూచించారు. అలాగే 75 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న స్థలాల్లో ఎలాంటి భవన నిర్మాణ అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణాలను, నిర్మాణ ఎత్తుతో సంబంధం లేకుండా గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ రెండు కేటగిరీలకు చెందిన నిర్మాణ దశలో ఉన్న భవనాలను గుర్తించిన వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ల ద్వారా కూల్చివేత చేపట్టాలని కమిషనర్ స్పష్టం చేశారు.

ఫిర్యాదులతో పాటు స్వయంగా గుర్తింపు

అక్రమ నిర్మాణాల గుర్తింపు విషయంలో పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులు స్వయంగా గుర్తించిన నిర్మాణాలపైనా చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్రమ నిర్మాణం ఎలా గుర్తించబడిందన్న దానితో సంబంధం లేకుండా నిబంధనల ప్రకారం చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు.

రోజువారీగా కూల్చివేతల పర్యవేక్షణ

నేటి నుంచి ఈ కేటగిరీల కింద చేపట్టిన కూల్చివేతల సంఖ్యను ప్రతిరోజూ పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. అక్రమ నిర్మాణాలను ఎప్పటికప్పుడు గుర్తించడం, క్షేత్రస్థాయిలో కఠిన పర్యవేక్షణ కొనసాగించడం, గుర్తించిన వెంటనే అవసరమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టే వారికి అడ్డుకట్ట వేయడంతో పాటు, నిర్మాణ దశలోనే అక్రమ భవనాలను తొలగించేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను నిరంతరం కొనసాగించాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!