హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తి ఫొటో తీసినందుకు ట్రాఫిక్ హోంగార్డుతో గొడవపడి,దుర్భాషలాడిన వ్యక్తిని నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 7న తాజ్ ఐలాండ్ జంక్షన్ వద్ద ఘటన జరిగింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరించినట్లు కేసు నమోదైంది. నిందితుడు మొహమ్మద్ రిజ్వాన్ను అరెస్ట్ చేసి, TS09GB5336 నంబర్ గల ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడిన వ్యక్తి అరెస్ట్
RELATED ARTICLES
