కోర్టుల్లో ఏళ్ల తరబడి కొనసాగే కేసులను మధ్యవర్తిత్వం ద్వారా త్వరగా పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి జిఎస్‌ఎల్ ప్రియాంక తెలిపారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి,సంస్థ చైర్మన్ ఆదేశాల మేరకు మధ్యవర్తులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ‘మధ్యవర్తిత్వం ఫర్ నేషన్3.0’పై అవగాహన కల్పించారు. కుటుంబ,ఆస్తి,వాణిజ్య వివాదాలతో పాటు రాజీకి వీలున్న సివిల్ కేసులను మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవచ్చన్నారు.దీనివల్ల సమయం,ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాల మధ్య సంబంధాలు కొనసాగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఇరుపక్షాల అంగీకారంతో సాగుతుందని తెలిపారు.అనంతరం కరపత్రాన్ని విడుదల చేశారు.సమావేశంలో కూకట్పల్లి మల్కాజ్‌గిరి, మేడ్చల్, ప్రాంతాల మధ్యవర్తులు పాల్గొన్నారు.
