e-Paper
Saturday, September 12, 2026
Homeతెలంగాణవికారాబాద్34వ వార్డులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న కాలనీవాసులు..

34వ వార్డులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు.. భక్తిశ్రద్ధలతో పాల్గొన్న కాలనీవాసులు..

📰 Generate e-Paper Clip

వికారాబాద్ : పట్టణంలోని 34వ వార్డులో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అయ్యప్ప స్వామి దేవాలయంలో కాలనీవాసుల ఆధ్వర్యంలో చంద్రకళ నేతృత్వంలో జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ అనంతలక్ష్మి–విజయేందర్ గౌడ్ హాజరై కాలనీవాసులతో కలిసి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకృష్ణుడిని భక్తిశ్రద్ధలతో కొలిచారు.

కౌన్సిలర్ అనంతలక్ష్మి–విజయేందర్ గౌడ్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. శ్రీకృష్ణుడి బోధనలు, సందేశాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఐకమత్యంతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో కాలనీవాసులు, చిన్నారులు, మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!