దుండిగల్‌గండి మైసమ్మ: బౌరంపేట సర్వే నంబర్ 472లోని అసైన్మెంట్ భూములపై దళితులకు హక్కులు కల్పించాలని బౌరంపేట మాజీ సర్పంచ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు కొమ్ము మంగమ్మ డిమాండ్ చేశారు. సోమవారం దళితులతో కలిసి మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 75 ఏళ్లుగా 32 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్న సుమారు 100 కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పించకుండానే భూమిని స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. దుండిగల్‌లో అసైనీలకు ఇస్తున్న విధంగానే బౌరంపేట దళితులకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.
అసైన్మెంట్ భూముల్లో హక్కులు కల్పించాలి
RELATED ARTICLES
