e-Paper
Wednesday, September 16, 2026
Homeభక్తి - ఆధ్యాత్మికతఖైరతాబాద్‌లో పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహ తయారీకి శ్రీకారం

ఖైరతాబాద్‌లో పంచముఖ సంకటహర మహాగణపతి విగ్రహ తయారీకి శ్రీకారం

📰 Generate e-Paper Clip

ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్ : ఖైరతాబాద్‌లో ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి పంచముఖ సంకటహర మహాగణపతి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ ప్రత్యేక రూపంలో ఐదు ముఖాలతో గణనాథుడు కొలువుదీరనున్నారు.

నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూజతో మహాగణపతి విగ్రహ తయారీ పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ఖైరతాబాద్ గణపతి విగ్రహ నిర్మాణం ప్రారంభం కావడంతో ఉత్సవాల సందడి మొదలైంది.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్, రాజ్ కుమార్, వీణ మాధురి, సందీప్ రాజ్, బాల్‌కుమార్, రాచప్ప, రాము, సతీష్, రాజ్, వినోద్, సాయి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!