శంకర్పల్లి : మండలంలోని సరిగూడ గ్రామ సమీపంలో ఉన్న మై ఫెయిర్ నుంచి కొండకల్, మై హోమ్,నల్లగండ్ల, రాయదుర్గం మీదుగా జె ఎన్ టి యు వరకు కొత్త ఏసీ బస్సు సేవను ప్రారంభించారు. ఈ కొత్త బస్సు సేవతో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులకు నగరానికి రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి.ఈ బస్సు ప్రతిరోజూ ఉదయం 7:45 గంటలకు మై ఫెయిర్ నుంచి బయలుదేరి, ఉదయం 8:00 గంటలకు కొండకల్ చేరుకుని అక్కడి నుంచిమై హోమ్,నల్లగండ్ల, రాయదుర్గం,మీదుగా జె ఎన్ టి యు వెళ్తుంది.తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4:20 గంటలకు జె ఎన్ టి యు నుంచి అదే మార్గంలో బయలుదేరి రాత్రి 7:00 గంటలకు మై ఫెయిర్‌కు చేరుకుంటుంది.ఈ కొత్త ఏసీ బస్సు సేవ ప్రారంభం కావడంతో కొండకల్ పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులకు ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు.
