e-Paper
Saturday, September 12, 2026
Homeతెలంగాణతెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, ఆగస్టు 1: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TGPLRB) కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మొత్తం 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన బోర్డు, తాజాగా ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించింది.అధికారిక ప్రకటన ప్రకారం, ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించుకోవచ్చు.ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ కానిస్టేబుల్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు www.tgprb.in⁠� వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలని బోర్డు స్పష్టం చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు Aadhaar Face Authenticationను Aadhaar App ద్వారా పూర్తి చేయాలని సూచించింది.

దరఖాస్తు రుసుము

ఎస్‌సీ / ఎస్‌టీ అభ్యర్థులు

SI పోస్టులు – ₹750

కానిస్టేబుల్ పోస్టులు – ₹600

ఇతర అభ్యర్థులు

SI పోస్టులు – ₹1,500

కానిస్టేబుల్ పోస్టులు – ₹1,200

అలాగే, ఒకే PMT/PET ద్వారా బహుళ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు బోర్డు తెలిపింది. అదనపు పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు దరఖాస్తు రుసుములో రాయితీ కూడా ఉంటుందని వెల్లడించింది.పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు దరఖాస్తు తేదీలను గమనించి, అవసరమైన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకుని, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ సూచించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!