e-Paper
Saturday, October 31, 2026
HomeతెలంగాణKPHB: LIG టవర్స్ శంకుస్థాపనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

KPHB: LIG టవర్స్ శంకుస్థాపనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి గురువారం కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిర్వహించనున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల (ఇందిరమ్మ LIG టవర్స్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

కార్యక్రమానికి సుమారు 300 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎం.రమేష్‌, ఐపీఎస్ బుధవారం సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. బాంబ్‌ డిస్పోజల్‌ బృందంతో ప్రాంగణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ట్రాఫిక్‌ ప్రణాళికను రూపొందించినట్లు సీపీ తెలిపారు. అవసరమైన చోట్ల ట్రాఫిక్‌ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమం విజయవంతంగా, ప్రశాంతంగా జరిగేలా పోలీస్‌, ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. సభకు వచ్చే ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!