ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం సర్కిల్ పోచమ్మ బస్తిలో నిర్వహించిన నల్ల పోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, నల్ల పోచమ్మ తల్లి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆలయ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్‌ను శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు గోపాల్ గౌడ్, సంధ్య, మహేందర్ రెడ్డి, పూలమ్మ, సుగ్రీవుడు, శ్రీకాంత్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు.
