e-Paper
Wednesday, September 16, 2026
Homeరాజకీయంగురు పౌర్ణమి సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టుముక్కల జస్వంత్...

గురు పౌర్ణమి సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టుముక్కల జస్వంత్ రావు (దేశల్)

📰 Generate e-Paper Clip

గురు పౌర్ణమి సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ గొట్టుముక్కల జస్వంత్ రావు (దేశల్) పలు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.మొదటగా కేపీహెచ్‌బీలోని శ్రీ జగన్ గురూజీ యోగశాలలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ గురూజీ గారిని జగన్ గురూజీ యోగ సాధకుల మిత్ర మండలి సభ్యులతో కలిసి ఘనంగా సత్కరించారు.అనంతరం కేపీహెచ్‌బీ 2వ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ఆలయ చైర్మన్ ఎల్. రాజా గారి ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ దేశల్ గారిని, దేశల్ మిత్ర మండలి సభ్యులను శాలువాలతో సత్కరించింది.తదుపరి కూకట్‌పల్లిలోని సాయిబాబా ఆలయంలో వడ్డేపల్లి ఫౌండేషన్ ఆహ్వానం మేరకు జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు దేశల్ గారిని, మిత్ర మండలి సభ్యులను శాలువాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.అలాగే కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీ సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ దేశల్ గారికి సాయిబాబా చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించింది.ఈ కార్యక్రమాల్లో శ్రీ జగన్ గురూజీ యోగ సాధకుల మిత్ర మండలి, మానవ సేవ ఫౌండేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోవింద్ గౌడ్, వెంకటరమణ, గాదె శివాచౌదరితో పాటు దేశల్ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!