e-Paper
Thursday, July 30, 2026
Homeతెలంగాణబొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

📰 Generate e-Paper Clip

  • పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు చుక్కలు వేసిన ఎమ్మెల్యే

ఆదాబ్ సైబరాబాద్, కూకట్‌పల్లి : కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం బాలానగర్ మండలంలోని ఫిరోజ్‌గూడలో నిర్వహించిన బొడ్రాయి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకులు, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫిరోజ్‌గూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎక్కడ ఉన్నా సరే తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం మర్చిపోవద్దని, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!