టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ప్రకటన
ఆదాబ్ సైబరాబాద్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)లో మొత్తం 7,437 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వివిధ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పోలీస్, ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్, ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నట్లు బోర్డు ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు.

పోలీస్ శాఖలో పోస్టుల వివరాలు
- సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్) – 148
- రిజర్వ్ ఎస్‌ఐ (ఏఆర్) – 14
- రిజర్వ్ ఎస్‌ఐ (టీజీఎస్‌పీ) – 12
- రిజర్వ్ ఎస్‌ఐ (ఎస్‌ఏఆర్‌సీపీఎల్) – 3
- అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌పీబీ) – 23
- పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) – 3,697
- పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) – 1,052
- పోలీస్ కానిస్టేబుల్ (ఎస్‌ఏఆర్‌సీపీఎల్) – 24
- పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) – 20
- పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) – 7
ఫైర్ డిపార్ట్‌మెంట్ పోస్టులు
- స్టేషన్ ఫైర్ ఆఫీసర్ – 39
- ఫైర్ ఫైటర్ – 751
జైళ్ల శాఖలో పోస్టులు
- డిప్యూటీ జైలర్ (పురుషులు) – 14
- డిప్యూటీ జైలర్ (మహిళలు) – 1
- వార్డర్ (పురుషులు) – 196
- వార్డర్ (మహిళలు) – 12
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) పోస్టులు
- సబ్ ఇన్‌స్పెక్టర్ – 44
- కానిస్టేబుల్ – 1,380
త్వరలో నోటిఫికేషన్
స్థానిక క్యాడర్ వారీ పోస్టుల పంపిణీ, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు తదితర పూర్తి వివరాలను హోంశాఖ, సంబంధిత శాఖల నుంచి స్వీకరించిన అనంతరం కొద్ది రోజుల్లోనే అధికారిక నియామక నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెల్లడించింది.
ఈ భారీ నియామకాలతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు మరో కీలక అవకాశం లభించనుంది.
