e-Paper
Wednesday, September 16, 2026
Homeఆంధ్రప్రదేశ్ఏపీ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్‌కు ఘన స్వాగతం

ఏపీ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్‌కు ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

ఆంధ్రప్రదేశ్ పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆస్ట్రేలియా ప్రభుత్వ అంతర్జాతీయ విద్య, పౌరసత్వం, కస్టమ్స్, సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్‌కు రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రులు జూలియన్ హిల్‌ను ఆహ్వానించి, ఆంధ్రప్రదేశ్‌లో విద్య, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకార అవకాశాలపై చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పర్యటనతో ఆస్ట్రేలియా–ఆంధ్రప్రదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!