e-Paper
Wednesday, September 16, 2026
HomeGHMCగాజులరామారంలో “ది బేక్ హౌస్” స్వీట్స్ అండ్ బేకరీ ప్రారంభం

గాజులరామారంలో “ది బేక్ హౌస్” స్వీట్స్ అండ్ బేకరీ ప్రారంభం

📰 Generate e-Paper Clip

ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

ఆదాబ్ సైబరాబాద్, కుత్బుల్లాపూర్ : నియోజకవర్గంలోని గాజుల రామారం డివిజన్ మహాదేవపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన “ది బేక్ హౌస్” స్వీట్స్ అండ్ బేకరీని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. బాబు మహేష్, అభినయ్, దుర్గా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బేకరీని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, మెరుగైన సేవలు అందిస్తూ వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే ఇటువంటి వ్యాపార సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు విజయ్ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, తెలంగాణ సాయి, మూసాఖాన్, ఇమ్రాన్ బేగ్, చెట్ల వెంకటేష్, తారా సింగ్, మసూద్, చిన్న చౌదరి, రాములు గౌడ్, దూలప్ప, నవీన్ దండుగుల, ప్రసాద్, శ్రవణ్, గౌస్, జునైద్, సయ్యద్ రంజాన్, భాస్కర్ ముదిరాజ్, రవికిరణ్ యాదవ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!