కూకట్‌పల్లి: మహిళల ఆరోగ్యం, సంతానోత్పత్తి వైద్య సేవల రంగంలో నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో కైతలాపూర్ డివిజన్ ఆంజనేయ నగర్‌లో ఏర్పాటు చేసిన కిమయా గైనిక్ & ఫర్టిలిటీ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి తెలంగాణ కమ్మ సంఘం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆసుపత్రిని ప్రారంభించారు. డాక్టర్ సంహిత అలుకూర్, డాక్టర్ జుహుల్ పటేల్ ఆహ్వానం మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, మహిళల ఆరోగ్య సంరక్షణతో పాటు సంతానోత్పత్తి సమస్యలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే కేంద్రంగా కిమయా గైనిక్ ఫర్టిలిటీ సెంటర్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆసుపత్రి వైద్య బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు, వారి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ బీ-బ్లాక్ అధ్యక్షుడు తూము వేణు, ఏఎంసీ చైర్మన్ పుష్పా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు లక్ష్మయ్య, తూము వినయ్ కుమార్, భాశెట్టి ప్రభాకర్, సప్పిడి భాస్కర్, కాస నర్సింహా యాదవ్, జోజమ్మ, ఎండీ నయీమ్, పాషా తదితరులు పాల్గొన్నారు.
