కుత్బుల్లాపూర్ ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి, ట్రాఫిక్ విధుల్లో ఎదురవుతున్న సమస్యలపై సిబ్బందితో చర్చించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ వెంకటేశ్వరరావు, సీఐలు మధుసూదన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
