ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా జర్నలిస్టులపై పోలీసులు నిఘా పెట్టారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దూమర్ల భాస్కర్ ను వాకింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులో తీసుకున్నారు. టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో-కన్వీనర్లు బండి విజయ్‌కుమార్, యాదగిరి తదితరులు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లరు, వెంటనే స్పందించిన ఎస్పీ జర్నలిస్టులను విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో రూరల్ పోలీసులు వారిని పంపించారు.
