e-Paper
Friday, July 31, 2026
Homeరాజకీయంతొలి ఏకాదశి సందర్భంగా శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీఆర్ఎస్...

తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు డి. అనిల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్‌కు చెందిన భాస్కర్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆల్విన్ కాలనీ ఫేజ్–2లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డి. అనిల్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించి భక్తులతో కలిసి తొలి ఏకాదశి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రఘురామ్ రెడ్డి, కాలనీ వాసులు, భక్తులు, టీం అనిల్ రెడ్డి మిత్ర మండలి సభ్యులు తదితరులు పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!