e-Paper
Friday, July 31, 2026
Homeతెలంగాణమేడ్చెల్ మల్కాజ్‌గిరిమల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్‌లోకి భారీగా యువత చేరికలు

మల్కాజ్‌గిరిలో బీఆర్‌ఎస్‌లోకి భారీగా యువత చేరికలు

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా

ఆదాబ్ సైబరాబాద్ , మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీలో భారీగా యువత చేరారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో సైనిక్‌పురి, నేరేడ్మెట్, వెంకటాపురం డివిజన్లకు చెందిన పలువురు యువకులు, వివిధ పార్టీల నాయకులు గులాబీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో యువత బీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషకరమన్నారు. యువత భాగస్వామ్యంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, బీఆర్‌ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, జీకే హనుమంతరావు, చంద్రమౌళి, శేఖర్ గౌడ్, శివ గౌడ్, మారేడి రాజశేఖర్ రెడ్డి, పంజా శ్రీకాంత్ యాదవ్, సర్వేష్ తదితర నాయకులు, మహిళలు, యువత, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!