e-Paper
Friday, July 31, 2026
HomeతెలంగాణTELANGANA Social Welfare RIES ఇంటర్ స్పాట్ కౌన్సెలింగ్

TELANGANA Social Welfare RIES ఇంటర్ స్పాట్ కౌన్సెలింగ్

📰 Generate e-Paper Clip

జిల్లా స్థాయిలో జూలై 6న టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ ఇంటర్ స్పాట్ కౌన్సెలింగ్

హైదరాబాద్ : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం జూలై 6న జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) ఒక ప్రకటనలో తెలిపారు. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (RJCCET-2026) ద్వారా ఇప్పటికే రెండు విడతల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అయితే, ఇంకా కొన్ని సీట్లు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేసేందుకు జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారుఈ స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా మిగిలిన ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు సంబంధిత జిల్లా అధికారులను సంప్రదించి కౌన్సెలింగ్‌కు హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!