e-Paper
Tuesday, September 15, 2026
Homeక్రైమ్ న్యూస్YOUTUBE చూసి వైన్ తయారీ

YOUTUBE చూసి వైన్ తయారీ

📰 Generate e-Paper Clip

మల్కాజిగిరిలో అక్రమ వైన్ తయారీ కేంద్రం గుట్టురట్టు

వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్, మల్కాజిగిరి: యూట్యూబ్ వీడియోలు చూసి వైన్ తయారీ విధానాన్ని నేర్చుకున్న ఓ వ్యక్తి మల్కాజిగిరిలో గత ఏడాదిగా అక్రమంగా వైన్ తయారు చేసి విక్రయిస్తున్న ఘటనను ఎక్సైజ్ శాఖ అధికారులు వెలుగులోకి తెచ్చారు. దాడులు నిర్వహించి భారీ మొత్తంలో వైన్, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.

అరెస్టైన నిందితుడు ఆంటోనీ పీటర్గా గుర్తించారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా వైన్ తయారీ యూనిట్‌ను నిర్వహిస్తూ, నేరేడ్మెట్, సికింద్రాబాద్, కాప్రా ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఆంటోనీ పీటర్ యూట్యూబ్ వీడియోల ద్వారా వైన్ తయారీ నేర్చుకుని స్వయం ఉపాధి పేరుతో ఈ అక్రమ వ్యాపారం ప్రారంభించినట్లు వెల్లడైంది. ద్రాక్ష, అనాసపండు, జామ, బత్తాయి, సపోటా, అరటి, తమలపాకులతో మొత్తం ఏడు రకాల వైన్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

పండ్లను చక్కెర, గోధుమలతో కలిపి 15 రోజుల పాటు ఫెర్మెంటేషన్ చేసి, అనంతరం వడబోసి సీసాల్లో నింపి విక్రయించేవాడని అధికారులు తెలిపారు. 750 మిల్లీలీటర్ల ఒక్కో వైన్ బాటిల్‌ను రూ.300కు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి 377.7 లీటర్ల వైన్, 502 బాటిళ్లు, వైన్ తయారీకి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు రూ.1.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి విచారణ కోసం కాప్రా ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు.

#Hyderabad, #Malkajgiri, #Wine, #IllegalWine, #ExciseDepartment, #Kapra, #Neredmet, #Secunderabad, #CrimeNews, #Telangana, #YouTube, #LiquorRaid, #ExciseRaid, #BreakingNews, #TeluguLocal

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!