పశ్చిమ బెంగాల్‌లో అంతర్రాష్ట్ర, సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న డ్రగ్స్ సిండికేట్‌పై దక్షిణ దినాజ్‌పూర్, మాల్దా జిల్లా పోలీసులు సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించారు. మాల్దా జిల్లాలోని మంగళ్‌బారి ప్రాంతంలో చేపట్టిన దాడుల్లో ₹2.4 కోట్ల నగదు, సుమారు ₹90 లక్షల విలువైన వేలాది కఫ్ సిరప్ బాటిళ్లు, 20 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గత నెల అరెస్టైన స్మగ్లర్ మృదుల్ ఘోష్ విచారణలో లభించిన సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో అతని ప్రధాన అనుచరుడు పింటూ సర్కార్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెల్లడించింది.
