e-Paper
Saturday, September 12, 2026
Homeజాతియంగాలిలో ఒక్కసారిగా 300 అడుగులు దిగిన విమానం ప్రయాణికులకు గాయాలు

గాలిలో ఒక్కసారిగా 300 అడుగులు దిగిన విమానం ప్రయాణికులకు గాయాలు

📰 Generate e-Paper Clip

ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 2379 విమానం గాలిలో తీవ్ర వాయు అల్లకల్లోలానికి (టర్బులెన్స్) గురైంది. దీంతో విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందికి పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించారు. ఘటనను వివరిస్తూ ఓ ప్రయాణికుడు, “విమానం ఒక్కసారిగా కిందికి పడిపోవడంతో మేమంతా సీట్ల నుంచి పైకెగిరి విమానం పైభాగానికి బలంగా తగిలి మళ్లీ కిందపడ్డాం. ఒక వ్యక్తి చేతిలో ఉన్న చిన్నారి కూడా గాల్లోకి ఎగిరి మూడు సీట్ల దూరంలో పడింది. ఆ క్షణాలు భయానకంగా అనిపించాయి” అని తెలిపాడు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారులు వివరాలు సేకరిస్తుండగా, విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!