కుషాయిగూడ : జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా కుషాయిగూడ జమ్మిగడ్డ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆశా వర్కర్లకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు కేశెట్టి ప్రసాద్, మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాకాల రాజ్‌కుమార్, జిల్లా కార్యదర్శి అల్లూరయ్య, పెద్ది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పోలియో రహిత సమాజం కోసం రోజంతా శ్రమిస్తున్న వైద్య సిబ్బంది, ఆశా వర్కర్ల సేవలను గుర్తించి వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భోజన వసతికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, పల్స్ పోలియో విధుల్లో నిమగ్నమైన సిబ్బందికి భోజన వసతి కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ బీసీ సెల్ నాయకులు సింగం కిరణ్, మామిడి శ్రీనివాస్, ఉపేందర్ రెడ్డి, రహమతుల్లా, సలీం, సువాస్, ప్రకాష్, రాజేష్, సాయి, ఉమేష్, రామ్ తదితరులు పాల్గొన్నారు.
