e-Paper
Wednesday, September 16, 2026
HomeHealth & Fitnessపోలియో చుక్కలు వేయిద్దాం.. పోలియోను నిర్మూలిద్దాం!

పోలియో చుక్కలు వేయిద్దాం.. పోలియోను నిర్మూలిద్దాం!

📰 Generate e-Paper Clip

  • జీడిమెట్ల ప్రభుత్వ పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమం
  • పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు

కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల 132వ డివిజన్, కుత్బుల్లాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరారెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న వైద్య సిబ్బంది సేవలను అభినందిస్తూ, కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, “పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత. ఐదేళ్ల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. జూలై 1వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నందున తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు తోడ్పడాలి” అని పిలుపునిచ్చారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని, ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

error: Content is protected !!